27న మైనార్టీ అధ్యక్షుడి ఎన్నికలు
On
విశ్వాంభర, పెద్దశంకరంపేట : ఈ నెల 27న పెద్దశంకరంపేట మైనార్థీ అధ్యక్షుడి ఎన్నికను నిర్వహించనున్నట్లు మాజీ కోఆప్షన్ సభ్యులు సాజిద్, ఎండీ.ఫయాజ్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఓటింగ్ ద్వారా ఈ ఎన్నిక జరుగుతుందని, 27న మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ఉంటుందన్నారు. స్థానిక మోతీషాహీద్ దర్గాలో పోలింగ్ జరుగుతుందన్నారు. ఈ పోలింగ్లో మైనార్టీ సభ్యులందరూ పాల్గొనాలని వారు కోరారు. పోలింగ్ అనంతరం అధ్యక్షుడిని ప్రకటించనున్నట్లు చెప్పారు.



