రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు.
అధ్యక్షుడు బేతి రవీందర్ రెడ్డి వెల్లడి.
విశ్వంభర, హనుమకొండ:= రోటరీ క్లబ్ హనుమకొండ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హనుమకొండ ఆధ్వర్యంలో హనుమకొండ ఏకశిలా పార్కు వాకర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్లు రోటరీ క్లబ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బేతి రవీందర్ రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్లు మహేష్, ప్రసాద్ రావు,గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కోసం మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు.క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశ స్టేజ్ 1 లో గుర్తించి నట్లైతే రోగికి చికిత్స అందించి రోగి ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ గంగోజుల నరేష్, కోశాధికారి మిర్యాల రాజ్ కుమార్,బాలసముద్రం ఏకశిలా పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి,సెక్రటరీ,కోశాధికారి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



