వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించాలి

WhatsApp Image 2024-07-24 at 12.47.12_020a45ad

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో వికలాంగుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ లోడి ధనంజయ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని , ఉత్తమ్ కుమార్ రెడ్డిని , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ని కోరారు . వికలాంగులపై చాలా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చి  వికలాంగులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .

 

Read More దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం