ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం. 

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం. 

  • -సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట

విశ్వంభర , భద్రాచలం :- డివిజన్ ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీ సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికపై వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను వినిపించి పరిష్కారం పొందే అవకాశాన్ని ప్రజావాణి కార్యక్రమం కల్పిస్తోందన్నారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, విద్యుత్, తాగునీరు, రోడ్లు, వైద్య సేవలు, గృహ పథకాలు, వ్యవసాయం, ఆదివాసీ సంక్షేమం, విద్య, ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను లిఖితపూర్వకంగా తమ వినతిపత్రాల రూపంలో సమర్పించాలని ఆయన సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదులకు సంబంధించిన ఆధార పత్రాలు, జిరాక్స్ ప్రతులు, సంప్రదింపు వివరాలను జతపరిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతం అవుతుందని తెలిపారు.అలాగే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలు క్రమశిక్షణ పాటిస్తూ ముందస్తుగా తమ వినతిపత్రాలను సిద్ధం చేసుకుని రావాలని, సంబంధిత సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-aim-is-to-solve-peoples-problems/article-15270

Tags: