మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలంతో విస్తృత తనిఖీలు

విశ్వంభర, మహబూబబాద్ :-జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, టౌన్ డీఎస్పీ తిరుపతి రావు గారి పర్యవేక్షణలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించారు.మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన జగిలంతో కూడిన జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది సహకారంతో టౌన్ పోలీసులు పట్టిపాక రోడ్డులోని క్రాంతి ట్రాన్స్‌పోర్ట్, నవత ట్రాన్స్‌పోర్ట్, ఎస్‌ఆర్‌ఎంటీ ట్రాన్స్‌పోర్ట్ కేంద్రాలతో పాటు ఆర్టీసీ బస్ స్టాండ్ పార్సిల్ కార్యాలయం, ఎన్‌టీఆర్ స్టేడియం రోడ్డులో ఉన్న అమెజాన్, డెలివరీ నౌ, ఫ్లిప్‌కార్ట్ పార్సిల్ కార్యాలయాలలో టౌన్ ఎస్.ఐ రామ్ చరణ్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా అనుమానాస్పద పార్సిళ్లు, సరుకులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ మాదక ద్రవ్యాల రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ పేర్కొన్నారు.

🕒 15 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/extensive-checks-with-specially-trained-inspectors-to-detect-narcotics/article-15331

Tags: