ఉపాధి సివిల్ వర్కులపై సర్పంచిలతో సమీక్ష

ఉపాధి సివిల్ వర్కులపై సర్పంచిలతో సమీక్ష

విశ్వంభర, నెల్లికుదురు: ఉపాధి హామీ పనులు ఇతర సివిల్ వర్క్ నెల్లికుదురు మండలంలోని సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సింగారపు కుమార్ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారుల సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జరుగుతున్న పనులు, గ్రామపంచాయతీ భవనాలు,వివో,అంగన్వాడి బిల్డింగ్స్, కిచెన్ షెడ్లు, పాఠశాలల ప్రహరీ గోడలు, సైడ్ కాలువలు, సిసి రోడ్ల తదితర పనులపై సమీక్షించారు. మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా నిర్మించడానికి ప్రభుత్వం 14 జీవో బిల్డింగులు మంజూరు చేసిందని సంబంధిత భవనాల నిర్మాణానికి కావలసిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏపిఎం నరేంద్ర కుమార్ సర్పంచులకు సూచించారు.పలువురు సర్పంచులు తమ గ్రామాలలో సైతం వివో బిల్డింగులు కావాలని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అవసరమైన చోట రూ.30 లక్షల తో గోదాములు నిర్మించుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన దృష్ట్యా సర్పంచ్ లు చొరవ చూపాలని ఎంపీడీవో కుమార్ సూచించారు. వివో భవనాలు మంజూరు కాని గ్రామాలు సైతం ఆయా సర్పంచ్ లు బిల్డింగుల కోసం తీర్మానాలు తీసుకురావాలని సంబంధిత ప్రతిపాదనలు అధికారులకు పంపనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఇతర సివిల్ పనులు వేగవంతంగా చేపట్టి నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయితీ రాజ్ డిఈ రాజ్ కుమార్, ఎంపీఓ పద్మ, ఏపిఎం నరేంద్ర కుమార్, ఏపీవో మాధవి వివిధ గ్రామాల సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/review-with-sarpanchis-on-employment-civil-works/article-15730

Tags: