మిర్యాలగూడ లో ఓటు హక్కు వినియోగించుకున్న సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్
విశ్వంబర, మిర్యాలగూడ: మిర్యాలగూడ లో 41 వార్డులో 123 పోలింగ్ కేంద్రంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మున్సిపల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక ఎలక్షన్ నిర్వహణ ప్రక్రియను, ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హౌసింగ్ బోర్డ్ లోని 15వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకోగా.. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, కుటుంబ సభ్యులతో బాపూజీ నగర్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ లో మొత్తం 93020 ఓట్లు ఉండగా.. అందులో పురుషుల ఓట్లు 45128, స్రిల ఓట్లు 47,578 ఇతరులు 14 ఓట్లు ఉన్నాయి. బుధవారం జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో సాయంత్రం ఏడు గంటల వరకు 72036 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మిర్యాలగూడ మున్సిపాలిటీలో 77.44 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎలక్షన్లలో రెడ్డి కాలనీలో ఇరు వర్గాల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొనగా పోలీసులు ఇరు వర్గాల వారిని లాఠీలతో చె దరగొట్టారు..



