నాణ్యతలేని ఇండ్లకు మరో పేరే జగనన్న కాలనీ
- హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప
విశ్వంభర, రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆలమూరు జగనన్న లేఔట్ లో నాణ్యతలేని ఇంటి నిర్మాణాలు చేసిన మీకు ఎమ్మెల్యే పరిటాల సునీతను విమర్శించే హక్కు లేదంటూ హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే పరిటాల సునీతపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ నాటి వైయస్సార్ ప్రభుత్వంలో మీ మనిషే అయి నటువంటి అమర్నాథ్ రెడ్డికి కాంట్రాక్టు కట్టబెట్టి నాణ్యతలేని జగనన్న ఇంటి నిర్మాణాలను నిర్మించి ప్రజలకు అన్యాయం చేసిందే కాకుండా ఆ ఇంటి నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. రెండు అడుగుల పునాదులు వేసి కొన్ని ఇండ్లు నిర్మించి నాణ్యత లేదు అని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు చేశారని తెలిపారు. అస్సాం నుండి మనుషుల్ని పిలిపించి పని రానివాళ్ల తో పని చేపిస్తూ ఇల్లు నిర్మాణం రానటువంటి మనుషులతో ఇల్లు కట్టించి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న మీరు నేడు పరిటాల సునీతమ్మను విమర్శించడం మంచిది కాదన్నారు. పునాదినిండా బొక్కలే గోడలు ముట్టుకుంటే సిమెంటు కూడా రాలిపోతుంది వర్షం వస్తే నాలుగు మూలల కారే స్లాబ్ లను నిర్మించిన ఇంటి నిర్మాణాలకు కూడా ప్రజల నుంచి 30 వేల రూపాయలు వసూలు చేసుకున్న మిమ్మల్ని ఏమనాలి అని ప్రశ్నించారు. మీరు మీ మిషనరీ అక్కడ వదిలి వెళ్ళిన సిమెంటు ఇసుక, కడ్డీలు ,పోయాయని అంటున్నారు అవన్నీ ఎవరు తీసుకు వెళ్లారో ప్రజలందరికీ తెలుసు అని అంతేకాకుండా అక్కడ ఉన్న ఎర్రమట్టిని అప్పుడు అధికారంలో ఉన్న నాయకులు అమ్ముకు న్నారన్న విషయాన్ని ప్రజలందరూ గమనించారన్నారు.



