సూర్యాపేట అభివృద్ధిలో కల్నల్ సంతోష్ బాబు తల్లి కీలక భూమిక పోషించాలి: చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్త.
విశ్వంభర, సూర్యాపేట :-సూర్యాపేట అభివృద్ధిలో కల్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కుమల్ల మంజుల ఉపేందర్ కీలక భూమిక పోషించాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. ఆదివారము సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు అభ్యర్థిని బిక్కుమల్ల మంజుల ఉపేందర్ గెలుపుకై మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు గొప్పతనాన్ని గుర్తించి వారి కుటుంబానికి కెసిఆర్ అండగా ఉన్నాడని గుర్తుకు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంతోష్ బాబు తల్లి మంజులకి టికెట్ కేటాయించి మరోసారి గొప్ప ఔవునత్యాన్ని చాటుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన, బూతు పురాణం నడుస్తుందని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం అని పొద్దున్నే లేస్తే నీతి పురాణాలు వెలించే బిజెపి సైతం మంజులపై పోటీని పెట్టడం దుర్మార్గమని అన్నారు. సూర్యాపేట మరింత ప్రగతి పదములు నడిపించాలంటే జగదీశ్వర్ రెడ్డి నాయకత్వం ఎంత అవసరమని, ఆయన బలపరిచిన మంజుల ఉపేందర్ ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు. మాజి సైనిక ఉద్యోగులు అందరు కలిసి మద్దతు తెలిపితే ఎందుకు రావడం ఎంతో ఆనందించదగ్గ విషయమని తెలిపారు.



