లండన్ లో చేనేత ఖ్యాతి చాటనున్న చిలుకూరి శ్రీనివాస్.
అభినందనలు తెలిపిన గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు ఏలే మహేష్ నేత
విశ్వంభర, హైదరాబాద్ :- నల్గొండ జిల్లా చండూరు పట్టణానికి చెందిన చిలుకూరు శ్రీనివాసులకు గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు ఏలే మహేష్ నేత హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు.ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ చిన్ననాటి నుండే ఎంతో కష్టపడి చేనేత రంగంలో మంచి గుర్తింపు సాధించిన శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు. చేనేత కళను ప్రపంచదేశాల్లో సైతం శ్రీనివాస్ సేవలు, చేనేత కళా ప్రదర్శనలు జరగాలని ఆకాంక్షించారు. భారత దేశ చేనేత కళలు నైపుణ్యాలను లండన్ వేదికగా ప్రపంచానికి చాటునున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు అక్కడ జరగనున్న 76వ వర్తక షో స్ప్రింగ్ ఫెయిర్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మేడ్ ఇన్ ఇండియా పెవిలియన్ లో చేనేతపై లైవ్ డెమోకు ఆయన ఎంపికయ్యారు. ఈ లైవ్ డెమోలో మగ్గంపై చీరలు తయారు తో పాటు డబల్ ఇక్కత్, కోట ఇక్కత్, జమ్లాని వెరైటీల తయారీ విధానాలను శ్రీనివాస్ ప్రదర్శించనున్నారు. ఈనెల 29న లేదా 30న లండన్ కు బయలుదేరనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. 15 ఏళ్లుగా చేనేత రంగంలో తన పడిన కష్టాన్ని గుర్తింపు లభించింది అన్నారు.



