తలొగ్గేది లేదు.. వెన్నుచూపేది అంతకన్నా లేదు: జగన్
- రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైంది
- ప్రజాస్వమ్యవాదులు చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలి
- తాడేపల్లి కూల్చివేతపై స్పందించిన ఏపీ మాజీ సీఎం
తాడేపల్లిలో నిర్మాణ దశలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను తారాస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలతో చంద్రబాబు రక్తాన్ని పారిస్తున్నారు.’’
‘‘ఈ ఘటన ద్వారా ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, కక్షసాధింపు చర్యలకు తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల కోసం ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నా’’ అంటూ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత పనులను సీఆర్‌డీఏ అధికారులు ఉదయం 5.30గంటల నుంచే మొదలు పెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, పొక్లెయినర్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే, ఈ నిర్మాణం అక్రమమని సీఆర్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2024