డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4 రోజుల జైలు  

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4 రోజుల జైలు  

  • పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

విశ్వంభర, సూర్యాపేట: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన  ఐదుగురిలో  ఒకరికి నాలుగు  రోజుల జైలు శిక్ష, ఇంకొకరికి ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష, జరిమానా , మరో ముగ్గురికి జరిమానా  సూర్యాపేట కోర్టు విధించినట్లు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పలు  ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని ఈరోజు కోర్టులో హాజరుపర్చగా  ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గోపు రజిత ఈ విధంగా తీర్పు వెల్లడించినట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. పోలీసులు చేసే వాహన తనిఖీలు ప్రజల ప్రాణరక్షణ కోసమే అని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Tags: