మున్సిపల్ చైర్‌పర్సన్ పర్యటన

మున్సిపల్ చైర్‌పర్సన్ పర్యటన

విశ్వంభర, గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ చందన రవీందర్ బుధవారం పర్యటించారు. వార్డులోని పలు వీధులను సందర్శించి స్థానిక పరిస్థితులను, పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. వార్డు పర్యటనలో భాగంగా 10వ వార్డు కౌన్సిలర్ కోట బాబు వార్డులో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ కాలువలు, సి.సి. రోడ్లు, వీధి దీపాల సమస్యలను చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు. విన్నపాలపై సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్ చందన రవీందర్ మాట్లాడుతూ.. వార్డుల అభివృద్ధికి తమ పాలకవర్గం కట్టుబడి ఉందని, ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చైర్‌పర్సన్ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి తమ వార్డుకు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కౌన్సిలర్ కోట బాబు, వార్డు ప్రజలు  శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags: