సార్లంకపల్లే బాధితులకు భరోసా.. తక్షణ సాయం, పక్కా ఇళ్లు..!!

విశ్వంభర, ఏపీ బ్యూరో: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె గ్రామంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం గిరిజన కుటుంబాలను తీవ్రంగా కలచివేసింది.

విశ్వంభర, ఏపీ బ్యూరో: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె గ్రామంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం గిరిజన కుటుంబాలను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో 26 గుడిసెలు పూర్తిగా దగ్ధమై బూడిదయ్యాయి. ఫలితంగా 33 కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయి ఒక్కసారిగా నిరాశ్రయులయ్యాయి. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే ఈ కుటుంబాలు ఇల్లు, సామగ్రి అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాయి.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే అండగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ప్రతి కుటుంబానికి రూ.25 వేల నగదు అందించాలని, ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ పక్కా గృహం మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే బాధితులకు తాత్కాలిక నివాసం, ఆహారం, అవసరమైన నిత్యావసరాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Read More మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి పవన్‌ కల్యాణ్

సీఎం ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

తహసీల్దార్ ఎస్‌వీ నరేశ్ మాట్లాడుతూ, 33 కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు సాయం పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి బాధిత కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం బాధితులకు ఆహారం, ఇతర అవసరాల సరఫరా కొనసాగుతోందని వివరించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.babu

Tags: