కన్వెన్షన్ హాల్ ప్రారంభం
On
విశ్వంభర, సంగారెడ్డి : పటాన్‌చెరు మండలం శాంతినగర్‌కు చెందిన యువ మిత్రులు నందిగామలో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ హాల్‌ను ఘనంగాప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ మిత్రులను అభినందిస్తూ, ఆలోచనలు ఆచరణలో పెట్టినప్పుడు విజయాలు సొంతమవుతాయి. శ్రమ ఎప్పుడూ వృథా కాదు అని పేర్కొన్నారు. స్థానిక యువత స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయడంఅభినందనీయమని, ఇలాంటి ప్రయత్నాలు మరెందరికో ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. నూతన కన్వెన్షన్ హాల్ ద్వారా ప్రాంత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని శుభాకాంక్షలు తెలిపారు.



