చేనేత వస్త్రాల తయారీ కేంద్రాన్ని సందర్శించిన శివ శివాని కాలేజ్ విద్యార్థులు
విశ్వంభర, భూదాన్ పోచంపల్లి :- చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ ప్రక్రియను తెలుసుకునేందుకు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లి లోని శివ శివాణి డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రపంచ చేనేత పర్యాటక కేంద్రమైన భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా పోచంపల్లిలోని కళా పునర్వి చేనేత హ్యాండ్లూమ్ యూనిట్ ను సందర్శించి రంగులు అద్దటం,అక్కడి మగ్గాలను,నూలు పోగు మగ్గంపైకి ఎలా వస్తుంది,చిటికీల తయారీ,చేనేత కార్మికులు చీర తయారీ ఎలా చేస్తున్నారు అనే విషయాలను అక్కడి కార్మికులను, కళా పునర్వి వ్యవస్థాపకులు సాయిని భాస్కర్, సాయిని భరత్ లను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు చేనేత కళాకారుల కళాత్మక నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.చేనేత కళాకారుల నైపుణ్యాన్ని చూసి అద్బుతమని కొనియాడారు..ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి. మమత,ఫాకల్టీ జి. వెంకటేష్,టి. గౌతమి,కళా పునర్వి వ్యవస్థాపకులు సాయిని భాస్కర్,సాయిని భరత్ పాల్గొన్నారు.



