జిల్లా ఉత్తమ మహిళగా కందుకూరి భాగ్యలక్ష్మ
On
విశ్వంభర, నాగారం : గ్రామీణ అభివృద్ధి సంస్థలో బుక్ కీపర్ తో పాటు పాల కేంద్రం నడిపిస్తూ వ్యాపారంలో రాణిస్తున్న నూతనకల్ మండల కేంద్రానికి చెందిన కందుకూరి భాగ్యలక్ష్మిని జిల్లా ఉత్తమ మహిళగా గుర్తించడంతో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క చేతుల మీదుగా జిల్లా ఉత్తమ మహిళా అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... ప్రతి మహిళా అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఉత్తమ మహిళాగా ఎంపిక అయినందుకు స్థానిక ప్రజలు, మహిళలు భాగ్యలక్ష్మి కి శుభాకాంక్షలు తెలిపారు.



