లైసెన్స్ ఫీజు బకాయిలపై కఠిన చర్యలు

లైసెన్స్ ఫీజు బకాయిలపై కఠిన చర్యలు

  • ప్రత్యేక డ్రైవ్‌కు డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆదేశం

విశ్వంభర, హైదరాబాదు : రంగారెడ్డి పరిధిలో ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్లు లైసెన్స్ ఫీజుల పెండింగ్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ ఆదేశించారు. సోమవారం హైదరాబాదు అబ్కారీ భవన్ సమావేశ మందిరంలో రంగారెడ్డి డివిజన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నిర్ణయించిన మద్యం విక్రయ లక్ష్యాలను ఎస్‌హెఓలు, ఈఎస్‌లు సమర్థంగా పర్యవేక్షించి టార్గెట్లు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ ఫీజుల బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు, డీటీఎఫ్ టీమ్‌లు లైసెన్స్ కలిగిన మద్యం దుకాణాలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఎన్‌డీపీఎల్, ఫ్యూరియస్ లిక్కర్ అక్రమ అమ్మకాలు జరగకుండా కట్టడి చేయాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ అమ్మకాలు, రవాణాపై కఠిన పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ కిషన్‌తో పాటు మేడ్చల్, వికారాబాద్, సరూర్‌నగర్ ఈఎస్‌లు నవీన్, భాస్కర్ గౌడ్, ఉజ్వల రెడ్డి పాల్గొన్నారు.

Tags: