మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి
విశ్వంభర, అశోక్ నగర్ : మహిళల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుధ్య మహిళా సిబ్బందికి చీరలు అందజేసి శాలువతో సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ రూ.500రూపాయలకే సబ్సీడీ కింద గ్యాస్ సిలిండర్, వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు పథకాలు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరో పదేండ్లు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో గ్యాదరి మధు, గయాజుద్దీన్, హర్ష హుస్సేన్, అజ్మత్, విజయ డానియల్, మున్నా, సంతోషి, ముదసిర్, తదితరులు పాల్గొన్నారు.



