ఘనంగా వందనపు ఆంజనేయులు జన్మదిన వేడుకలు
విశ్వంభర, చింతపల్లి: ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు, చింతపల్లి గ్రామ 1వ వార్డు మెంబర్ వందనపు ఆంజనేయులు జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ హాజరై పుష్ప గుచ్ఛాలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంజనేయులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండి ప్రజల సమస్యలు పరిష్కారించాలని తెలిపారు. రాజకీయ పరంగా ఇంకా ఉన్నత స్థాయిలో గొప్ప పదవులు పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు సిరాజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల యాదగిరి, మాజీ ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, మాజీ ఉప సర్పంచ్ ఎస్కే సలీం, గ్రామశాఖ అధ్యక్షులు గోవిందు రవి కుమార్, చెట్లపల్లి హారి ప్రసాద్, వీకే శ్రీను, యాచారం శ్రీను, కంచుకట్ల సాయి ప్రసాద్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.



