ఘనంగా ఆత్మీయ సమ్మేళనం
విశ్వంభర, గౌలి పుర : గౌలి పురాలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1981 లో మొదలైన ఈ పాఠశాలఎన్నో ఒ డుదుడుకులు పడుతూ, నిరంతరం అభివృద్ధి చెందుతూ, నూతన వరవడికి నాంది పలుకుతూ, పిల్లల భవిష్యత్తులకు పునాదులు వేస్తూన్న, ఈ పాఠశాలలో విద్యను బోధించిన, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, బోధనను పొందిన విద్యార్థిని విద్యార్థులు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమా నికి శ్రీకారం చుట్టారు.వయసుతో సంబంధం లేకుండా ఎంత ఎదిగినా ఒదిగినట్టు, గౌరవాన్ని చూపిస్తూ, కన్నీటి పర్యంతం, ఆనందభాష్పాలు, వివిధ హావభావాల సందర్భంలో అధ్యంతం చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్ బి సుబ్రహ్మణ్యం( విద్యా భారతి క్షేత్ర ఉపాధ్యక్షులు), రచిట్ పాఠక్ ,పతాకమూరి శ్రీనివాస్ (విద్యాపీఠ ప్రాంత సంఘచన కార్యదర్శి తెలంగాణ )ఆలే శ్యాం కుమార్, పాఠశాల అధ్యక్షులు విజయ కుమార్ విటల్ దాస్ ( ప్రముఖ వ్యాపారవేత్త), రూప్ రాజ్ లు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.



