ఇనుగుర్తి పిహెచ్ సిలో  మెగా హెల్త్ క్యాంప్

ఇనుగుర్తి పిహెచ్ సిలో  మెగా హెల్త్ క్యాంప్

 విశ్వంభర, ఇనుగుర్తి: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ఇనుగుర్తి మండల కేంద్రంలోని పీహెచ్సీలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డా.సురేష్ తెలిపారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పిల్లలు,ఎముకలు,కంటి,డెంటల్,స్త్రీలు, జనరల్ కు సంబంధించిన ఆరు విభాగాల స్పెషలిస్ట్ వైద్యులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. మాత శిశు కిషోర్ వృద్ధ సేవలు సైతం అందించనున్నట్లు తెలిపారు. ఉ.9 నుంచి సా.4-0గంటల వరకు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తారన్నారు.పీహెచ్సీ పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు,పంచాయితీ కార్యదర్శులు,వివిధ పార్టీల నాయకులు,సమాజ సేవకులు తమ తమ గ్రామాలలో సమాచారం అందించి అధిక సంఖ్యలో అవసరమైన వారు సద్వినియోగం చేసుకునేలా విజయవంతం చేయాలని కోరారు.

Tags: