హైతాబాద్‌లో ప్రజలకు అందుబాటులోకి ‘బుగ్గారెడ్డి క్లినిక్స్’ – ప్రారంభించిన గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి*

హైతాబాద్‌లో ప్రజలకు అందుబాటులోకి ‘బుగ్గారెడ్డి క్లినిక్స్’ – ప్రారంభించిన గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి*

విశ్వంభర, షాబాద్:రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో డాక్టర్ అనురాగ్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన “బుగ్గారెడ్డి క్లినిక్స్” ను రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఎంతో శుభపరిణామమని అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనేక కంపెనీలు ఏర్పడుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించడం అభినందనీయమని తెలిపారు. ప్రజల ఆరోగ్య సేవల కోసం ముందుకు వచ్చిన బుగ్గారెడ్డి హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచులు శాంతమ్మ, యాదయ్య, నాయకులు జనార్దన్ రెడ్డి, ఖాజామియా, సుభాష్ రెడ్డి, శ్రీనివాస్, జంగిరి, విష్ణువర్ధన్ రెడ్డి, శేఖర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆసుపత్రి సిబ్బంది మరియు గ్రామస్తులు హాజరయ్యారు.

Tags: