విద్యార్ధులకు గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు
విశ్వంభర, రామన్నపేట: ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో బిఎ తృతీయ సంవత్సరం చదువుతున్న సురేష్ గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖానం సురేష్ ను వారికి నాయకత్వం వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తాటిశెట్టి శ్రీనివాసులను ఇతర విద్యార్థులను అభినందించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రామన్నపేట కళాశాల నుంచి పదిమంది విద్యార్థులను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తాటిశెట్టి శ్రీనివాసులు న్యాయకత్వంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆపద సమయంలో విద్యార్థులు స్పందించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. యువ ఆపదమిత్ర శిక్షణ పొందిన విద్యార్థుల పేర్లు సింగపాక సురేష్, మహేష్ రేష్మా, ఆసియా, భావన, మౌనిక,భవాని, చంద్ర శేఖర్, సమీర్, సాయి మొదలగువారు ఈ శిక్షణలో పాల్గొన్నారు.



