డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండాలి

డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండాలి

విశ్వంభర, చిక్కడపల్లి : యువత డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చిక్కడపల్లి ఎస్‌ఐ అబిలాష్ సూచించారు. షాహిద్ భగత్ సింగ్ యువజన ఉత్సవాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ హైదరాబాదు కమిటీల ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కళాశాలలో నిర్వహించిన కబడ్డీ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జావీద్, నాయకులు లెనిన్, రాజయ్య, నాగేందర్, రజనీకాంత్, ప్రవీణ్, అశ్వక్, అర్జున్ పాల్గొన్నారు.

Tags: