పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి
విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మండల కేంద్రం, జ్యోతిబాపూలే సెంటర్లో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పెంచినగ్యాస్ ధరలు తగ్గించాలని కట్టెలపోయి పైవంట కార్యక్రమం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది, ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని పాపారావు మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరల బారం మోపి,మహిళలపై గృహ వినియోగదారులకు సిలిండర్ పై 60 రూపాయలు, వాణిజ్య వినియోగదారులకు 115 రూపాయలు పెంచడం జరిగింది, తక్షణమే పెంచినగ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల దశలవారి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు చాగంటి కిషన్, కావటి నర్సయ్య, నీరుటి జలంధర్, జల్లే జయరాజ్, సోమరపు ఎల్లయ్య, అల్పుగొండ సావిత్ర, తోట యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.



