మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
విశ్వంభర, బషీర్ బాగ్: మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే దేశం బాగుపడుతుందని జై మహాభారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అనంత విష్ణు ప్రభు ఉద్ఘాటించారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శాలువాలతో సత్కరించి మెమెంటో లను హైదరాబాద్ రవీంద్రభారతిలో జై మహాభారత్ పార్టీ, వైకుంఠo ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం అనంత విష్ణు ప్రభు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం, రాష్ట్రం పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆడవాళ్లు బాగుంటూనే రాజ్యం బాగుంటుందన్నారు. నేడు మహిళలు అన్ని రాజకీయ రంగాలలో ప్రవేశించాలని వారి సత్తాను చాటాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఎక్కడైతే మహిళలను దేవతలుగా పూజింపబడతారో అక్కడ ఆ దేశం బాగుపడుతుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో షేక్ షాహిన్, భవాని, యాస్మిన్, దుర్గా, స్వరూప, చంద్రకళ, సూర్య ప్రియ, డాక్టర్ రాజశ్రీ, ప్రియా సాహూ, కే సింధు, ఎం. సువర్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



