డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తతే కీలకం
- సైబర్ కైమ్ డీఎస్పీ
విశ్వంభర, ఖమ్మం : డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటమేనని సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ అన్నారు. కిన్నెర నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ..బ్యాంక్ ఖాతా నుండి డబ్బు పోతే, వెంటనే బ్యాంక్‌కు సమాచారం అందించి ఖాతాను స్తంభింపజేయాలని తెలిపారు.అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకపోవడం, బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం, వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకపోవడం ద్వారా ఆన్‌లైన్ మోసాలను అరికట్టవచ్చని అన్నారు. సైబర్ మోసానికి గురైనట్లయితే, వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ స్టాకింగ్, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ మోసం, డిజిటల్ అరెస్ట్,వ్యాపార పెట్టుబడి,లోన్ యాప్, ఆన్‌లైన్ భద్రతా చిట్కాలు,బెట్టింగ్ యాప్, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు, గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబర్ నేరాలపై విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు.విజేతలకు బహుమతులు అందజేశారు.



