హెచ్.పి.వి వ్యాక్సిన్ పంపిణీ

హెచ్.పి.వి వ్యాక్సిన్ పంపిణీ

విశ్వంభర, రామన్నపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో హెచ్.పి.వి వ్యాక్సినేషన్ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్) కార్యక్రమాన్ని ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డా.శ్వేత ప్రియంకచే ప్రారంభించడం జరిగింది. గర్భకోశ ముఖ క్యాన్సర్ నివారణకు భాగంగా, 14వ పుట్టినరోజు పూర్తి చేసుకుని 15వ సంవత్సరం నడుస్తున్న బాలికలకు ఈ టీకాను ఇవ్వడం జరుగుతోంది. కార్యక్రమం ప్రారంభ రోజున మొత్తం 17 మంది బాలికలకు హెచ్.పి.వి  వ్యాక్సిన్ అందజేయబడింది. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ డాక్టర్లు పిల్లల వైద్యులు డా.వీరన్న, డా.రాజా గోపాల్, స్త్రీ వైద్య నిపుణులు, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డా.వంశీ కృష్ణ, మునిపంపుల వైద్యాధికారి డా.అశ్విణి కుమార్, పీపీ యూనిట్ వైద్యులు డా.పురుషోత్తం, హెక్ష్హ్.ఈ.ఓ గోపాల్, సూపర్వైజర్ వాణిశ్రీ, ఏ.ఎన్.ఎం మంజుల, సాధియ, హెల్త్ అసిస్టెంట్ మల్లేష్, డీ.ఏఎ.ఓ రమేష్, ల్యాబ్ టెక్నీషియన్ సతీష్, స్టాఫ్ నర్సులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గర్భకోశ ముఖ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్.పి.వి వ్యాక్సిన్ ముఖ్యమైన రక్షణ అని తెలిపారు. అర్హత ఉన్న అన్ని బాలికలు ఈ టీకాను తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

Tags: