మహిళా కార్మికుల సేవలు సమాజానికి ఆదర్శం

మహిళా కార్మికుల సేవలు సమాజానికి ఆదర్శం

విశ్వంభర, అంబర్ పేట : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాదు బాగ్ అంబర్పేట మల్లికార్జున్ నగర్ పార్కులో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ మహిళా కార్మికులు, వైద్య సిబ్బంది పగలు-రాత్రి తేడా లేకుండా ప్రజల సేవలో నిరంతరం తపిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. వారు చేస్తున్న కృషిని ఎల్లప్పుడూ మెచ్చుకొని సముచిత గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత రోహిత్, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు, మహిళా కార్మికులు మరియు స్థానిక నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, అనిల్ కుమార్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: