ఈ నెల 17 నుంచి డిగ్రీ పరీక్షలు
On
విశ్వంభర, రామన్నపేట: ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఇయర్ వైస్ విధానంలో చదివిన విద్యార్థులకు బ్యాక్ లాగ్ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖానం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.చిన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను పరీక్షలకు ఒక రోజు ముందుగా రామన్నపేట డిగ్రీ కళాశాలలో పొందవచ్చని తెలిపారు.



