మహిళలు లేని ప్రపంచాన్ని ఊహించలేం 

మహిళలు లేని ప్రపంచాన్ని ఊహించలేం 

విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా కేంద్రం లోని నూకల రామచంద్రా రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం,ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా  కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి లక్ష్మణ్ మాట్లాడుతూ,  సృష్టికి మూలం మహిళలని,మహిళలు లేని ప్రపంచాన్ని ఊహించలేమని అన్నారు. వేదాల్లో  స్త్రీలకు అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉన్నదని చెప్పారు. మహిళా సాధికారత విభాగం  కో ఆర్డినేటర్ అన్నపూర్ణ మాట్లాడుతూ, పురాణ, ఇతిహాసాలలో సీత, ద్రౌపది వంటి వారు గొప్ప ఆత్మ గౌరవం కలిగి  ఉన్నారని, విద్యార్థినులు వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతకు ముందు విద్యార్థిని విద్యార్థులు మహిళల గొప్పతనం పై స్కిట్ ప్రదర్శించి గీతాలు ఆలపించారు.అనంతరం మహిళా అధ్యాపకులను, సిబ్బందిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.సీ హెచ్ శ్రీనివాసులు , ఐ.క్యు.ఏ.సి కో ఆర్డినేటర్ జె.అనిల్ కుమార్,  డాక్టర్ డి. రాజశేఖర్ , అధ్యాపకులు డా.మసూద్  అహ్మద్,డా.బి వినోద్ కుమార్, డా.బి శ్రీనివాస్, డా.వి సాంబశివరావు , డా.బి హతీరామ్,డా.ఖాసీంషా,యం సుమన్, యం వీరు,జె .రవితేజ, ఓ ఉదయ్ కుమార్,ఎం నరేష్,జి యాకయ్య, డి.ఎస్ రామన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags: