17న మహా గర్జన ను విజయవంతం చేయాలి 

17న మహా గర్జన ను విజయవంతం చేయాలి 

  • రాష్ట్ర అసెంబ్లీలో గొర్రెల కాపరుల సమస్యలు చర్చించాలి
  • బడ్జెట్ లో గొర్రెల పంపిణీకి నిధులు కేటాయించాలి 
  •  జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు

విశ్వంభర, గుండాల : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో గొర్రెల మేకల పెంపకందార్ల సమస్యలు చర్చించాలని జిఎంపిఎస్  జిల్లా  అధ్యక్షుడు మద్దేపురం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం వారం గుండాలలో పత్రికా ప్రకటన విడుదల చేసి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే గొల్ల కురుమలకు నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని తమ ఎన్నికల మెనిఫెస్టోలో  పెట్టి అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా వాగ్దానాల అమలులో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిఎంపిఎస్ ఐదేండ్ల పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం గొర్రె,మేకలకు నట్టల మందులు పంపిణీ చేపట్టిందని తెలిపారు.గొల్ల,కుర్మల ప్రధాన సమస్యలైన గొర్రెల పంపిణీ పథకం,గొర్రెల బీమా,గొర్ల కాపరులకు పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా పెంపు,50సం.లకు వృద్ధాప్య పెన్షన్లు,సొసైటీ ఎన్నికలు ఇతర ప్రధాన సమస్యలపై మార్చి 16న ప్రారంభమయ్యే తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చర్చించి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.మార్చి 17న  ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో వృత్తిదారులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Tags: