బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి
On
విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి భగత్ సింగ్ నగర్‌లో కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సిటిజన్ విభాగం అధ్యక్షురాలు కొత్తూరి శారద నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బస్తీలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమాజంలో సేవలందిస్తున్న మహిళలను, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన బీసీ రాజ్యాధికార సమితి ముఖ్య కార్యదర్శి పోశాల సరస్వతి మహిళల ఐక్యతతోనే సమాన సమాజ నిర్మాణం సాధ్యమని తెలిపారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాల శ్రీలత, లక్ష్మి, పరిగి జ్యోతి, పి. కృష్ణవేణి, లావణ్య, హారిక తదితరులు పాల్గొన్నారు.



