రామన్నపేట అభివృద్ధికి నిధులు కేటాయించాలి
విశ్వంభర, రామన్నపేట: ప్రజలకు కనీస మౌళిక సౌకర్యాలు కల్పించి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం చెందుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమం స్థానిక నాయకులతో కలసి నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకొని సిపిఎం ప్రజా ఉద్యమాలకు ప్రజా విరాళం చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఒకనాటి పాత తాలూకా, నియోజకవర్గ కేంద్రమైన రామన్నపేట నేడు సమస్యల వలయంలో ఉన్నదని, పట్టణ అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేయాలని అన్నారు. పారిశుధ్య లోపం, తాగునీటి సమస్యపై ప్రత్యేక చొరవ చూపి ప్రజా పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. అధిక వర్షాలు సంభవించినప్పుడు వరదల కారణంగా ఇండ్లలోకి నీరు వస్తుందని, డ్రైనేజి పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ధరలను పెంచి సామాన్యులపై పెనుభారాలు మోపుతుందని స్థానిక ప్రజలతో కలిసి గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలపటం జరిగింది. యుద్దాల కారణం చూపి పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలను పెంచి బీజేపీ ప్రభుత్వం పెదాలపై పెనుభారాలు మోపుతుందని, దేశంలో సామాన్య పేదల బ్రతికే పరిస్థితి లేదని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో ప్రజలు తిరగబడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యవర్గ సభ్యుడు కందుల హనుమతు, మండల కమిటి సభ్యులు గొరిగే సోములు, బావండ్లపల్లి బాలరాజు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, నాయకులు పల్లె సత్యం, బావండ్లపల్లి సత్యం, బాబూచారి, వేముల మల్లేశం, బండ శ్రీశైలం, మునికుంట్ల రాణి, కుందూరు వెంకటేశం, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.



