ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ కన్వీనర్‌గా అంబటి జోజి రెడ్డి కొనసాగింపు
విశ్వంభర, హైదరాబాద్: అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ కన్వీనర్‌గా అంబటి జోజి రెడ్డి కొనసాగుతారనీ, తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నాం అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ తెలిపారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకత్వంపై ప్రచారం చేస్తున్న తప్పుడు, ఆధారరహిత వార్తలను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బండా సురేందర్ రెడ్డి అకాల మరణం అనంతరం, 2025 డిసెంబర్ 4న హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశంలో, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సమక్షంలో అంబటి జోజి రెడ్డి నీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కన్వీనర్‌గా ఎన్నుకున్నారనీ తెలిపారు. అనంతరం 2026 జనవరి 10న కోల్‌కతాలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించారన్నారు. పార్టీ తదుపరి రాష్ట్ర మహాసభ జరిగే వరకు, పార్టీ రాజ్యాంగం ప్రకారం కొత్త రాష్ట్ర కమిటీ ఎన్నికయ్యే దాకా అంబటి జోజి రెడ్డి రాష్ట్ర కన్వీనర్‌గా కొనసాగుతారనీ స్పష్టం చేశారు. ఇటీవల కామ్రేడ్ జావేద్ లతీఫ్, కామ్రేడ్ కొండ దయానంద్ అనధికారికంగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ లోపల వర్గవాదం, విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర కమిటీ గమనించిందన్నారు. ఈ చర్యలపై వివరణ కోరుతూ వారికి షో-కాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. పార్టీ సమిష్టి నిర్ణయాలను దెబ్బతీయడం లేదా పార్టీ ఐక్యతను బలహీనపరిచే చర్యలపై పార్టీ రాజ్యాంగం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కమిటీ హెచ్చరించారు. తెలంగాణలోని పార్టీ సభ్యులు, నాయకులు, మద్దతుదారులు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, పార్టీ సంస్థను బలోపేతం చేయడానికి అంబటి జోజి రెడ్డి పూర్తి సహకారం అందించాలన్నారు.



