డిజిటల్ ఎఫ్‌ఐఆర్ నమోదుపై పోలీసులకు శిక్షణ
విశ్వంభర, షాద్ నగర్: ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో పోలీసు అధికారులకు కేసుల దర్యాప్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ శిరీష మరియు ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో కీలక అంశాలపై చర్చించారు.గొడవలు లేదా దాడులు జరిగినప్పుడు కేసులను ఎలా నమోదు చేయాలి, సాక్ష్యాలను ఎలా సేకరించాలి అనే అంశాలపై నందిగామ ఎస్ఐ యాదయ్య, ఏఎస్ఐ శ్రీనివాస్ వివరించారు.ఐటీ విభాగానికి చెందిన పీసీ బాలరాజు ఒక వినూత్న విధానాన్ని పరిచయం చేశారు. ఇకపై ఘటన జరిగిన చోటు నుండే డిజిటల్ పద్ధతిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు.డిజిటల్ సాక్ష్యాల సేకరణ వల్ల కేసుల విచారణ వేగవంతం అవుతుందని, బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందని అధికారులు తెలిపారు.షాద్‌నగర్ జోన్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలు, ఎస్ఐలు మరియు స్టేషన్ రైటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



