మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 

  • బోడుప్పల్లో 368వ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జ్ఞానమాల
  • అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య
  • మహిళా దినోత్సవ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కు ఘన సన్మానం

విశ్వంభర, బోడుప్పల్:   మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్  బోడుప్పల్ సర్కిల్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 368వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ, మాజీ ఎంపీటీసీ నత్తి జంగమ్మ తదితరులు పాల్గొని  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులను నత్తి మైసయ్య ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ,  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని, అంబేద్కర్ స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు రాజకీయాలలో ప్రవేశించి ప్రజలకు ఉత్తమ సేవలందించాలని   పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసయ్య, బోడుప్పల్ అరుంధతి మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గురుకుల యాకయ్య, చిల్ల అంజయ్య, కొండయ్య మేస్త్రి, జి వెంకటేశ్వర్లు, ఏ రాజేష్, యేసు రాజు, కంచి సతీష్, మహిళలు కమలమ్మ, విజయలక్ష్మి, సుగుణమ్మ, లింగమ్మ, యాకమ్మ, మంగమ్మ, సులోచన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ‎

Tags: