వివేకవర్ధిని హైస్కూల్ లో యోగ శిబిరం 

వివేకవర్ధిని హైస్కూల్ లో యోగ శిబిరం 

విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన  అంతర్ముఖ ఆనంద ఆనంద ఆరోగ్య యోగ శిబిరం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన శ్రీ సత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రముఖ యోగా గురువు భిక్షమయ్య , పాల్గొని యోగ సాధన యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తగ్గి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని చెప్పారు. యోగ మనిషిని అంతర్ముఖంగా మార్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ కరస్పాండెంట్ చిర్ర యా కాంతం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత యోగ సాధనను అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు. ఈ శిబిరాన్ని నిర్వహించడంలో సహకరించిన నిర్వాహకులు చింతనూరి సతీష్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు మరియు యోగా ఆసక్తి గల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

Tags: