ప్రభుత్వ ఆసుపత్రి లో హెచ్ పి వి వ్యాక్సిన్
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్ పి వి) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డిఎంహెచ్ఓ) డా. రవి రాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహిళల్లో గర్భాశయ కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా యువతులు, బాలికలు ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రజలు ఈ వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను తొలగించి ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు వ్యాక్సిన్ తీసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో హెచ్ పి వి వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించి మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీవీపీ కోఆర్డినేటర్ డా. చింత రమేష్, ఆర్ఎంఓ డా. జగదీశ్వర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (DIO) డా. లక్ష్మీనారాయణ, పెడియాట్రిక్ డాక్టర్ మోహన్ యూపీహెచ్‌సీ వైద్య అధికారి డా. మౌనిక, ఎంపీహెచ్‌ఈఓ కేఎల్ఎన్ స్వామి, తోట శ్రీనివాస్ గోపు రవి, అరుణ్, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.



