ఘనంగా మహిళా దినోత్సవం 

ఘనంగా మహిళా దినోత్సవం 

విశ్వంభర, బోడుప్పల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సిలువేరు శంకర్ ప్రజాపతి దంపతులు ఘనంగా నిర్వహించారు.వివేకానందనగర్ కాలనీ లో మహిళా వికాస్ కార్యక్రమం బీజేపీ సీనియర్ నాయకురాలు సిలివేరు శ్యామారాణి శంకర్ దంపతులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సుగుణా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గున్నారు. ప్రత్యేక అతిధులుగా జిల్లా బీజేపీ నాయకురాలు పద్మ మహేశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా నాయకురాలు బూషి సంధ్య, దీప్షిక, రాధిక మరియు అంపటి మమతా పాల్గున్నారు.  ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ మహిళలు అన్నరంగాలలో సాధికారత దిశగా ముందుకొచ్చి ఏ రంగంలో ఎవరికీ తీసిపోరు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తమ ప్రతిభతో రుజువు చేస్తోన్న సమాజంలో మనముండడం గర్వకారణమన్నారు.  నరేంద్ర మోదీ గారి పాలనలో దేశవ్యాప్తంగా మహిళల ప్రగతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని, మహిళలకు కేం ద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులతో పాటు  చట్టసభల్లో రిజర్వేషన్లను సైతం కల్పించారని కొనియాడారు.  గత 13 సంవత్సరాలుగా మహిళలను ప్రోత్సహించేందుకు, వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను అభినందించేందుకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళ వికాస్ అనే పేరుతో మహిళల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిలివేరు శ్యామారాణి శంకర్ దంపతులను అభినందించారు.  కార్యక్రమంలో బొడ్డు సంధ్య, సరిత, విజయలక్ష్మి, కొండా విజయ, రజిని, సిలివేరు బక్షపమ్మ, సిలివేరు కావ్య, ధరమ్ కుమార్, సీటోళ్ల జైకిషన్, కొండా ఐలయ్య యాదవ్, ధర్మ రాజి రెడ్డి, జైపాల్ రెడ్డి, రమేష్ గౌడ్ మరయు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: