ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు 

ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు 

విశ్వంభర, షాద్ నగర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ కమ్మ మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో షాద్ నగర్ శివమారుతి అయ్యప్ప దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలలలో పనిచేసే పారిశుధ్య మరియు మధ్యాహ్న భోజనం మహిళా కార్మికులను వారి శ్రమను గుర్తించి 66 మంది మహిళా కార్మికులకు చీరలను అందజేసి గౌరవించటం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  కమ్మ మహిళా సేవా సమితి సబ్యులు మాట్లాడుతూ, సమాజానికి తమకు చేతనైన  సేవ చేయాలనే సంకల్పంతో గత ఐదు సంవత్సరాల క్రితం ఈ కమ్మ మహిళా సేవా సమితి ని ఏర్పాటు చేసుకొని మొదటిగా జడ్చర్ల లోని మానసిక వికలాంగులకు ఆర్ధిక సహకారం అందించడం తో మొదలుపెట్టి, పేద విద్యార్ధుల చదువులకు సహకారం, గిరిజన వైద్య విద్యార్ధి కి ఆర్ధిక సహకారం,  ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఉన్న ఒక ప్రవేట్ అధ్యాపకునికి పెద్ద మొత్తంలో ఆర్ధిక సహకారం, అలానే మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పటికి షాద్ నగర్ లొ మున్సిపల్ మహిళా కార్మికులకు,ఆశా కార్మికులకు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలలో పనిచేసే పారిశుధ్య మరియు మధ్యాహ్న భోజన కార్మికులకు చీరల ను ఇచ్చి వారు సమాజానికి చేస్తున్న శ్రమను గుర్తించి గౌరవించు కునట్లు తెలిపారు. ఇలా శ్రామిక మహిళలను గౌరవించుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో కమ్మ మహిళా సేవా సమితి సభ్యాలు పాతూరి ఇంద్రాదేవి, పాతూరి హైమావతి, పినపాక  మంగా దేవి,నువ్వుల రమాదేవి, వట్టికూటి విజయ లక్ష్మీ, వట్టికొండ ఉమ, పెద్ది అంజనీ భవాని, మక్కపాటి లక్ష్మీ, రాణి, సి.ఆర్.పి నాగమణి "కమ్మ సేవా సమితి నాయకులు పాతూరి వెంకటరావు, పినపాక ప్రభాకర్, వట్టికొండ ఎర్రయ్య , మక్కపాటి మల్లేశ్వర రావు, వట్టికూటి రామసుబ్బారావు, పాతూరి రఘుపతి, ఆలూరి శ్రీను, కల్లూరి హరి కృష్ణ, మాజీ కౌన్సిలర్ రేటికల్ నందీశ్వర్, దేవాలయం మేనేజర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: