శ్రీకాంత్, స్వాతి వివాహానికి హాజరైన గాదరి కిశోర్

శ్రీకాంత్, స్వాతి వివాహానికి హాజరైన గాదరి కిశోర్

 విశ్వంభర,  నాగారం:  సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్‌లో వర్ధమానుకోట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గంట అవిలయ్య యాదవ్  కుమారుడు శ్రీకాంత్ స్వాతి  వివాహ వేడుక ఘనంగా జరిగింది.ఈ వివాహ కార్యక్రమానికి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి  మున్సిపాలిటీ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, నాగారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెట్లపెళ్లి ఉప్పలయ్య, నాగారం మండలం యూత్ అధ్యక్షుడు ఈధుల కిరణ్ కుమార్ ,చిల్లర చంద్రమౌళి, తెలుసూరి నర్సయ్య,  గ్రామ శాఖ అధ్యక్షులు బండగొర్ల ఎల్లయ్య యాదవ్, కంబాల మల్లేష్, గంట మహేందర్, మణికుమార్ , లింగరాజు స్థానిక నాయకులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Tags: