హాస్టల్ లో ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి
On
విశ్వంభర, అనంతపురం: అనంతపురం నగర శివారులోని అనంత లక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నైలాన్ తాడుకు వేలాడుతూ తోటి విద్యార్థులకు కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థి హరి ప్రసాద్ మొబైల్ పూర్తిగా పగిలిపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి రాయదుర్గం మండలం దొడగట్ట చెందిన హరి ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు.



