ఎల్లమ్మ తల్లి దయ ఉండాలి
విశ్వంభర, సిద్దిపేట: రేణుక ఎల్లమ్మ దేవాలయ 50ఏళ్ల వార్షికోత్సవం జరుపుకోవడం అందులో నేను పాల్గొనే భాగ్యం కలగడం తల్లి అనుగ్రహమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట రేణుక ఎల్లమ్మ దేవాలయ స్వర్ణోత్సవ వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ సిద్దిపేట రేణుక ఎల్లమ్మ తల్లి దయ ఉంటే అన్నింటా మంచి జరిగినట్టేనని, తల్లి ఎంతో మహిమన్విత అమ్మవారన్నారు. వార్షికోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. గౌడ సమాజం కోసం దేవాలయం ముందే రాష్ట్రంలోనే ఆదర్శంగా రూ.6కోట్లతో ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నామన్నారు. ఆలయ నిర్వాహకుల కోరిక మేరకు ఆలయానికి ఎల్లప్పుడూ ఏ సహాయమైన అందించానని, భవిష్యత్ లో కూడా అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు. 50ఏళ్ల ఉత్సవాలు జరుపుకొంటున్న సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.



