మహిళా పారిశుద్ధ్య  కార్మికులకు సన్మానం 

మహిళా పారిశుద్ధ్య  కార్మికులకు సన్మానం 

విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్ సర్కిల్ 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దానగళ్ళ అనిత యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవం వేడుకలు. అన్నపూర్ణ కాలనీలోని తమ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య  కార్మికులను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ధనగళ్ళ అనిత మాట్లాడుతూ తమ ఆరోగ్యాన్ని సహితం లెక్కచేయకుండా మన మాలీన్యాన్ని శుభ్రం చేస్తున్న మహిళ వనితలను అభినందించారు. తెల్లవారుజాము నుండి విధులను శుభ్రం చేస్తూ ప్రజా శ్రేయస్సుపై ప్రతినిత్యం శ్రమిస్తున్న మహిళా మణులకు మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దానగల్ల యాదగిరి,డివిజన్ ఆఫీసర్ శ్రీను, నత్తి దర్శన్,పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Tags: