మహిళలు అన్ని రంగాల్లో పోటీపడాలి
విశ్వంభర, కోదాడ: టీఎన్జీవో యూనిట్ సంఘ ప్రాథమిక సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అటు ఇంట్లో గృహిణీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ,ఇటు ఉద్యోగం లో రాణిస్తూ సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకు టీఎన్జీవో కోదాడ యూనిట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై సమాజంలో మహిళలు ఎదుగుతున్న తీరు, అధిగమిస్తున్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన టీఎన్జీవో కోదాడ యూనిట్ సంఘ ప్రాథమిక సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ లో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఉద్యోగులు బత్తిని మమత, రమాదేవి, రాధిక, మాతంగి స్రవంతి, నసీమ, మంజుల, కందుల ఝాన్సీ, దున్న లావణ్య, మాధవి, అరుణ, పిడమర్తి సునీత, పులిపాటి లావణ్య, లక్ష్మీ, శ్రీధర్, వేంకటనగేష్, మట్టపల్లి మహేశ్, గంటెపొంగు విక్రమ్ సాయిరాంరెడ్డి, పులి శ్రీనివాస్, రుద్రాక్షి భాస్కర్, రాజేష్, జగదీష్, పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.



