బీరప్ప మల్లన్న దేవాలయం ప్రారంభోత్సవం
On
విశ్వంభర, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని నంచెయిర్ గ్రామంలో బీరప్ప మల్లన్న దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దేవాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో దేవాలయాలు ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులిమామిడి అశోక్, ఉపసర్పంచ్ పూర్ణచందర్ గౌడ్, జైశంకర్ గౌడ్, ఉమశంకర్ గౌడ్, బీరప్ప–మల్లన్న దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



