ఆత్మరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలి
On
విశ్వంభర, హైదరాబాద్ : మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ సరస్వతి విద్యా మందిర్ స్కూల్, రాజన్నబాయిలో ఎన్బికేఏ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలలో ఆత్మరక్షణపై అవగాహన కల్పించేందుకు ఉచిత కరాటే శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కరాటే ప్రాధాన్యత, ఆత్మరక్షణ నైపుణ్యాలు, పెంపొందించుకోవాలన్నారు. కరాటే సాధన ద్వారా శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. భవిష్యత్తులో మరిన్ని బాలబాలికలు కరాటే నేర్చుకుని ఆత్మరక్షణలో నైపుణ్యం సాధించాలని నిర్వాహకులు మాస్టర్ గణేష్ నాయక్ తెలిపారు.



