జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్
విశ్వంభర, ఖమ్మం : ఖమ్మం వెలుగుమట్ల లో ఇండ్లు కోల్పోయిన బాధితులను సోమవారం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ లో పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూధాన్ బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని, ఇప్పటివరకూ బాధితులకు ప్రభుత్వం అండగా లేదని విమర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి వైద్య సహాయం కూడా అందలేదని, కవిత పేర్కొన్నారు. అనంతరం ర్యాలీ గా ఖమ్మం లోని జెడ్.పి సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద భూదాన్ నిర్వాసితులతో కలసి న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. బాధితులతో కలిసి జడ్పీ కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని జాగృతి కార్యకర్తలను, భూధాన్ బాధితులను చదరగొట్టి కొద్దిమంది కార్యకర్తలను వానాలపై ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాలుగు గంటల వ్యవధి అనంతరం పోలీసులు జాగృతి అధ్యక్షురాలు కవితను అరెస్టు చేసారు.



